కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తా : కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హలో
మెదక్ మంచి ప్రాంతం....
కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపిస్తా...
నిద్ర పోయే వాన్ని లేపారు నేనేంటో చూపిస్తా...
ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఊరుకోం....
కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హనుమంతరావు...
మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)
మెదక్ ప్రాంతం మంచి వ్యాపార కేంద్రంగా అనువైన ప్రాంతమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. గురువారం నూతనంగా మెదక్ జిల్లా కేంద్రం లో నిర్మించిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రం లో నేడు పెద్ద ఎత్తున చేరికలు కార్యక్రమం ఉందని, దీనికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నారని అన్నారు. ఈ చేరికలతో మెదక్ లో బీఆర్ఎస్ దుకాణం ఖతం అయినట్లే అని తెలిపారు. మైనంపల్లి నిద్ర లేపితే ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బావ, బావమరిది కి చుక్కలు చూపిస్తానని, యూట్యూబ్ చానల్ కు డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మీడియా పై దాడులు చేస్తే అరుకునేది లేదు ఎవరైనా మరో సారి దాడులకు పాల్పడితే సహించనని అన్నారు. బీ అర్ ఎస్ పార్టీ మళ్లీ ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ ఫీలింగ్ తీసుకుని వస్తుందనీ ఇది మంచి చర్య కాదని హితవు పలికారు. మరో సారి ఏదైనా గొడవలు చేసే ప్రయత్నం చేస్తే మీ న్యూస్ చానెల్, పేపర్ పై కూడా దాడి చేస్తామని అన్నారు. ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోము అన్నారు. మెదక్ లో ఇంత పెద్ద షో రూమ్ పెట్టడం మంచి పరిణామం తెలిపారు. మెదక్ లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు చేసేందుకు వస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మెదక్ మంచి ప్రాంతమని ఇక్కడ వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు ఎవరు వచ్చిన సహకరిస్తామని అన్నారు. మెదక్ నా కొడుకు మైనంపల్లి రోహిత్ కు రాజకీయ బిక్ష పెట్టిందని అన్నారు. ఈ సందర్భంగా చందన బ్రదర్స్ యజమానులు రామారావు, సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.