కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
By Prajaswaram
On
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
పఠాన్ చెరు
(ప్రజాస్వరం) పటాన్ చెరు,సాయి కాలనీలోని కళ్యాణ్ పాఠశాలలో, ప్రిన్సిపాల్ థాకూరు కిన్నెర,ఆధ్వర్యంలో బోనాల పండుగును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగని, తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అని విద్యార్థులకు చదువుతోపాటు, మన సాంప్రదాయాలు సంస్కృతి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులు తయారుచేసిన బోనాలను ఊరేగింపుగా విద్యార్థులతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సాయి కుమారి, సుప్రియ, తులసి, ఇంద్ర,జారీనా, లిఖిత, భాగ్యలక్ష్మి, స్వాతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
20 Jul 2025 17:05:12
వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..ఉన్నతమైన విద్యా ప్రమాణాలే లక్ష్యం... కుల్చారం బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ నిర్వహణ తీరు ఇతర వసతి గృహాలకు...