మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట
మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా వాహనం పైకి మక్క బుట్ట
మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగిస్తుండగా వాహనం పైకి ఓ వ్యక్తి మక్క బుట్ట విసిరాడు . మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమం ముగించుకుని, రాందాస్ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో త్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగిస్తుండగా తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తి ని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళారు. అనంతరం అతన్ని మందలించారు. కాగా అర్హులకు తప్పకుండా ఇళ్ళు అందిస్తామని, ఈ విడతలో రాకపోతే తరువాతి విడతలో అయినా తప్పక అందిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.