వసతి గృహాన్ని తనిఖీ చేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

వసతి గృహాన్ని తనిఖీ చేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
ఉన్నతమైన విద్యా ప్రమాణాలే లక్ష్యం... 
కుల్చారం బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ నిర్వహణ తీరు ఇతర వసతి గృహాలకు ఆదర్శం 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Read More కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

మెదక్ జూలై 20 (ప్రజా స్వరం)

Read More మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా....: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల ఉన్నత విద్యా ప్రమాణాలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.ఆదివారం కుల్చారం మండలం బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి  విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, స్టోర్ రూమ్, 
మెనూ, వసతి గృహంలో మరుగుదొడ్ల పరిశీలించారు. వసతి గృహ నిర్వాహన తీరు ను పర్యవేక్షించిన అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం 
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహాలలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని, కొత్తగా చేరిన విద్యార్థులతో ఐకమత్యంగా మెలుగుతూ వారిని వసతి గృహనికి అలవాటయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని, కొత్తగా చేరిన విద్యార్థుల పై దృష్టి పెట్టి విద్యార్థులతో కలిసి పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య తో పాటు క్రీడలపై ఆసక్తిని కల్పిస్తూ కొత్తగా చేరిన  విద్యార్థుల పట్ల దృష్టి పెట్టాలన్నారు.ఆరోగ్యంతో పాటు పరిశుభ్రత నిర్వహణ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతినెల వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలన్నారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా శానిటేషన్ చేపట్టి చెత్తను తొలగిస్తూ అహల్లాద కరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయా లన్నారు. కొత్త మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులతో సమీక్షించాలన్నారు. కలెక్టర్ వెంట బీసీ వసతి గృహ వార్డెన్ ఉమ, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More  42 కిలోల గంజాయి పట్టివేత