42 కిలోల గంజాయి పట్టివేత
ఔటర్ రింగ్ రోడ్డు వద్ద 42 కిలోల గంజాయిని స్వాధీనం
శామీర్ పేట, జూలై 19 (ప్రజా స్వరం) :
ఔటర్ రింగ్ రోడ్డుపై 42కిలోల గంజాయిని శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు... కర్ణాటక బీదర్‌కు చెందిన అంతరాష్ర్ట ముఠా బెల్లాలే ప్రవీణ్, అవినాష్ అలియాస్ వికాస్ జాదవ్, సతీష్ కదంలు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు తరచు వచ్చి ఎండు గంజాయిని అమ్ముకుని వెళ్లెవారు. ఈ క్రమంలోనే ఒరిస్సా రాష్ర్టంలోని మల్కన్‌గిరి జిల్లా పోడియా గ్రామానికి చెందిన జితు అలియాస్ హ్యాపీ నుంచి 42 కిలోల గంజాయిని సేకరించారు. పథకం ప్రకారం సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలంలోని మావినెల్లికి చెందిన రాథోడ్ హీరామన్‌కు విక్రయించాలని బయలుదేరారు. ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్క సమాచారంతో శామీర్‌పేట, మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వలపన్ని పట్టుకున్నారు. ప్రవీణ్, వికాస్ జాదవ్, సతీష్ కదంలను అదుపులోకి తీసుకుని వారి నుండి 42 కిలో గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే వికాస్ జాదవ్‌పై మంగళ్‌హాట్‌లో 3 కేసులు, సతీష్ కదంపై కుల్సుంపురలో 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.