తెలంగాణ లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని  అమలు చేయాలి : బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

తెలంగాణ లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని  అమలు చేయాలి : బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

తెలంగాణ లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని  అమలు చేయాలి : బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
హైదరాబాద్ / ఎల్బీనగర్  (ప్రజాస్వరం) :  
ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హాల్ లో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావును రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
 ఈ సందర్భంగా రామచంద్రరావు  మాట్లాడుతూ న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే  అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో చాలా మంది న్యాయవాదులపైన దాడులు చేయడం జరిగిందన్నారు.  భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రక్షణ చట్టం అమల్లో ఉందని  అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో 55,000 మంది న్యాయవాదులు  ఉన్నా  రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం ఉందన్నారు. అడ్వకేట్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. న్యాయవాదులు రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలన్నారు. ఎంతో మంది న్యాయవాదులు రాజకీయ నాయకులుగా వున్నారన్నారు. అడ్వేకెట్ ల పైన సోషల్ రెస్పాన్సిబిలిటి ఉందన్నారు. వెల్ఫేర్ ఫండ్ లో భాగంగా న్యాయవాదులకు భార్ అసోసియేషన్ కు 50 కోట్లతో కూడిన  మాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వాలని కోరారు.