గజ్వేల్, సిద్దిపేట పై కాదు మెదక్ ప్రజలపై దృష్టి పెట్టండి...బీఅర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.

గజ్వేల్, సిద్దిపేట పై కాదు మెదక్ ప్రజలపై దృష్టి పెట్టండి...బీఅర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.

సాగునీటి విడుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు....
రెండవ పెళ్లి కళ్యాణ లక్ష్మీ చెక్కుపై ఎందుకు అంత శ్రద్ధ.... 
గజ్వేల్, సిద్దిపేట పై కాదు మెదక్ ప్రజలపై దృష్టి పెట్టండి...
కాంగ్రెస్ రాగానే రైతుల సమస్యలు మొదలు... 

బీఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.

Read More బోనం ఎత్తిన మెదక్ క్షలెక్టర్ దంపతులు

మెదక్ జూలై 14 (ప్రజా స్వరం)

Read More మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష

ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన ఇప్పటికీ సింగూరు నీళ్ల విడుదల పై పాలకులకు శ్రద్ధ ఎందుకులేదని బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు సింగూరు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తో కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు నాట్లు వేసి సింగూరు నీటి కోసం ఎదురు చూస్తున్నారని, కానీ ఇక్కడి నాయకులు, అధికారులు నీటి విడుదలలో చేయకపోవడంలో అంతర్యం ఏంటో చెప్పాలని అన్నారు. జీవో ప్రకారం ఖరీఫ్ సీజన్ లో సింగూరు నీటిని విడుదల చేయాలని జీవో లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పంటలు వేసిన రైతులు ఒక వైపు నీటి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడి స్థానిక నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే గజ్వేల్, సిద్దిపేట నియోజక వర్గాల పై ఉన్న శ్రద్ధ మెదక్ నియోజక వర్గం పై ఎందుకు లేదని అన్నారు. రెండవ పెళ్ళి చేసుకుని రాని కళ్యాణ లక్ష్మీ పై ఉన్న శ్రద్ధ రైతులకు నీటి విడుదల పై ఎందుకు లేదని అన్నారు. సింగూరు నీటి విడుదల తో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని వందలాది ఎకరాలకు సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. రైతుల సమస్య ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి నీటి విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఅర్ఎస్ పదేళ్ల పాలన లో జీవో ప్రకారం జిల్లాకు రావాల్సిన నీటిని అడగకుండానే విడుదల చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీటి విడుదల పై జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం హల్దీ పరిధిలోని కాలువలు వెలవెలబోతున్నాయని, మల్లన్న సాగర్ నీటిని సైతం విడుదల చేయాలని కోరారు. ఈ సాగునీటి విడుదల విషయంలో ప్రభుత్వం నాలుగు రోజుల్లో స్పందించకుంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ 
వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీ అర్ ఎస్ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, కిష్టయ్య, సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, శ్రీనివాస్, జయరాజు తదితులు పాల్గొన్నారు.

Read More సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి