రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ ; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ ; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

జిల్లా లో 4,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇతర ఎరువులు... 
రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ... 
రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
 
మెదక్ జూలై 14 (ప్రజా స్వరం)

Read More వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు

జిల్లా వ్యాప్తంగా రైతులకు సమృద్ధిగా 4,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇతర  ఎరువులు అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం చిలిపిచెడు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సోమవారం కలెక్టర్ చిలిపిచేడు మండలంలో విస్తృతంగా పర్యటించి
ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు. ధరల పట్టికలను పరిశీ లించారు.  రైతులను విత్తన ధరలపై అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
 ఇండెంట్  ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎరువులు పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు. యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయ ఏర్పడిన పక్షంలో సమస్యను పరిష్కరిస్తూ కొత్త సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. వానాకాలంలో పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు. వర్షాకాలం పంటలను జిల్లాలో సమృద్ధిగా పండించుకుని రైతు కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More బోనం ఎత్తిన మెదక్ క్షలెక్టర్ దంపతులు