బోనం ఎత్తిన మెదక్ క్షలెక్టర్ దంపతులు

బోనం ఎత్తిన మెదక్ క్షలెక్టర్ దంపతులు

బోనం ఎత్తిన కలెక్టర్ దంపతులు....
ప్రత్యేక రాష్ట్రంలోనే బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తింపు...  
భక్తి, సాంప్రదాయం, వినోదంతో కూడుకున్న ఒక గొప్ప పండుగ... 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

మెదక్ జూలై 20 (ప్రజా స్వరం)


గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు పండుగ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం నల్ల పోచమ్మ అమ్మ వారికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ పట్టణం తారక రామ నగర్ కాలనీ లోని నల్ల పోచమ్మ ఆలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అయన సతీమణి శ్రీజ అమ్మ వారికి బోనం తీసుకు వచ్చి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల విశిష్టతను గురించి కలెక్టర్ మాట్లాడుతూ బోనాల పండుగ, భక్తి, సాంప్రదాయం, వినోదంతో కూడుకున్న ఒక గొప్ప పండుగ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో, స్త్రీలు అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పిస్తారని అన్నారు. పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు, ఇది సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో వస్తుందని, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బోనం, పాలు, బెల్లం, నూనె ఇతర పదార్థాలతో తయారు చేస్తారని తెలిపారు. నగరంలో ఆషాడమాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయని, గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారని, పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..