బీజేపీలో భారీగా చేరికలు
ఎంపీ రఘునందన్ రావు చేపడుతున్న అభివృద్ధి కి ఆకర్షితులవుతున్నారు : బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
మెదక్ , ( ప్రజాస్వరం ) :
స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయదుంధిబి మోగిస్తారని అస్యాదిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన పలువురు శనివారం బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వాన్ని భలపరుస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి చైతన్యపురి కాలనీ రాణి , రాజు ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ గారు, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్ ,మెదక్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి ,నాగరాజు ,జిల్లా కార్యదర్శి బాలరాజు , ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ ,నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య ,నర్సాపూర్ మండల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు నీలి నాగేష్ , నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు , రామ్ రెడ్డి , నర్సాపూర్ పట్టణ ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్ ,నర్సాపూర్ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బబ్బురి కృష్ణ , బీజేవైఎం నాయకులు అర్వంద్ వాల్దాస్, బీజేవైఎం మండల్ అధ్యక్షుడు రాజేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ , బీజేపీ నాయకులు ఈశ్వర్ ,బీజేవైఎం నాయకులు శ్యామ్ గౌడ్, అనిల్ , బండి వేణు , మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది