బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..

బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..

బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..

మెదక్ ఆగస్టు 16 (ప్రజా స్వరం)

బీజేపీ మెదక్ జిల్లా నూతన జిల్లా కమిటీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శనివారం మెదక్ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నూతన జిల్లా కమిటీ ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ మీపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత మీకు ఇవ్వడం జరిగిందని, పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. నూతన జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సంఘసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు బుచేష్ యాదవ్, తీగల శ్రీనివాస్, కే. నాగరాజు, కాజీపేట రాజేందర్, శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శులు వి. మహేశ్వరి, కల్కి నాగరాజు, బిక్షపతి, బాదె బాలరాజు, అశోక్ సాదుల, సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆంజనేయులు, కార్యాలయ కార్యదర్శి సాయికిరణ్ నియామకం అవ్వడం జరిగిందని అన్నారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..