పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

జిల్లాలో నిండుకుండలా చెరువులు....
సమన్వయంతో గణేష్ నిమజ్జన కార్యక్రమం....
అధికారుల సలహాలు సూచనలు పాటించాలి...

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం)

అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాటను పగడ్బందీగా చేపట్టాలని జిలా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ మండల కేంద్రంలో కొంటూరు చెరువును జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గజ ఈతగాల్లతో పాటు వాటంటీర్ల ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..