ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....

ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....

ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే....
గల్లంతైన వారికి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి... 
జిల్లా ఇన్చార్జి మంత్రి ఇచ్చే కోటి సరిపోతుందా....
బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టాలి...
అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దు....

ఎంపీ రఘునందన్ రావు....

మెదక్ ఆగస్టు 28 (ప్రజా స్వరం)

భారీ వర్షాలతో మెదక్ పట్టణం, పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం హవేలీ ఘనపూర్ మండలంలో భారీ వర్షాలు దెబ్బ తిన్న బ్రిడ్జి లను ఆయన పరిశీలించారు. అనంతరం మెదక్ పట్టణంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని కలిసి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అన్నారు. ప్రజలు మరింత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారన్నారు. నిన్న సాయంత్రం గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం మాత్రమే లభించందని మరొకరి మృతదేహం కోసం బృందాలు సాగిస్తున్నారు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని, ఆ వ్యక్తి కూడా ఈరోజు దొరకాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మృతి చెందిన బాధిత ఇద్దరి కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద మెదక్ పట్టణంలో ఉంచిన వారికి సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వచ్చి కోటి రూపాయలు ఆపత్తు సహాయం కింద ప్రకటించారని అన్నారు. సరైన నివేదిక ఇంచార్జ్ మంత్రికి జిల్లా స్థానిక అధికారులు సరైన నివేదిక ఇచ్చినట్లు కనిపించడం లేదన్నారు. తాత్కాలిక మరమ్మత్తుల కోసమే మెదక్ పట్టణంలో నీట మునిగిన పిల్లికోటల్ లో సబ్ స్టేషన్ను పునరుద్ధరించాలంటే సుమారు మూడు కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. వాటిని వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మునిగినటువంటి మెదక్ పట్టణంలోని సబ్ స్టేషన్ ను ఎత్తైన ప్రాంతంలో నిర్మించాలన్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నడ్డా లతో మాట్లాడి వరద ప్రాంతాలకు హెలికాప్టర్లు, ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని కోరినట్లు తెలిపారు.  జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షురాలు బెండ వీణ, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు కల్కి నాగరాజు, కాశీనాథ్, ప్రభాకర్, ఏం ఎల్ ఎన్ రెడ్డి, నందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..