సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం....
ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి.
నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి...
హై లెవెల్ బ్రిడ్జి లు కట్టడానికి శాశ్వత పరిష్కారం....
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మెదక్ ఆగస్టు 28 (ప్రజా స్వరం)
జిల్లాలో భారీ వర్షాలు వరదల సహాయక చర్యల్లో పాలన యంత్రాంగం తీరు అభినందనీయం సీఎం రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. గురువారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. మొదటగా గౌరవ వందన స్వీకరించిన ముఖ్యమంత్రి నీ అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో జిల్లాలో భారీ వర్షాలు వరదలపై సమీక్షించారు. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకస్మికంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు అని అటువంటి విపత్తుల సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆస్తి నష్టం పంట నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణనష్టాన్ని అంచనాలకు అనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు వరదలు ముంచేత్తుతున్న కారణంగా వాగులు చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాలను అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి లు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ వీడియో క్యాప్చర్ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరచాలని సూచించారు. వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాల యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తూ ఉన్నామని రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని నానో యూరియా పై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు. చివరగా ఫ్లడ్ ఎఫక్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు పౌరసరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.