సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే

సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే

ఇకపై క్యూఆర్ కోడ్ తోనే సెక్రటేరియట్ లోకి ఎంట్రీ 


హైదరాబాద్ (ప్రజాస్వరం) :

Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు

 ఇకపై సెక్రటేరియట్  లోనికి వెళ్లే వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే అనుమతించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజిటర్స్ లోపలికి రావాలంటే సంబంధిత  శాఖ  పేషీ ద్వారా డిజిటల్ పూర్తి సమాచారం తో కూడిన  ఈపాస్ సిస్టం తో క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి  విజిటర్స్ స్మార్ట్ ఫోన్ కు పంపుతారు. ఆ క్యూఆర్ కోడ్ ప్రధాన గేటు వద్ద చూపిస్తే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అక్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లోపలికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సాధారణ స్థితిలో లోపలికి అనుమతించే వారు దీంతో ప్రతిరోజు ఎంతమంది విజిటర్స్ లోపలికి వస్తున్నారు వారు ఏ పేసి లోకి వస్తున్నారు అనే విషయం పై పూర్తి సమాచారం ఉండగా పోవడంతో కొత్తగా ఈపాస్ సిస్టంను అధికారులు ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఈపాస్ సిస్టంను  ట్రయల్ రన్ గా కొన్ని శాఖల్లో ప్రవేశపెట్టి కొనసాగిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాస్ సాఫ్ట్ వేర్ క్యూఆర్ కోడ్ తో లోపలికి ఎంటర్ అయ్యే వారి పూర్తి సమాచారం ఇకపై అధికారుల వద్ద ఉండనుంది.

Read More బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...