ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు

ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు

ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
హైదరాబాద్ (ప్రజాస్వరం) :  
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శ్రీ రామకృష్ణారావు గారులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హజరయ్యారు.ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను వెలుపల తరలించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు.కాలుష్యకారక పరిశ్రమల తరలింపుకు స్పష్టమైన విధివిధానాలు, కాలపట్టిక రూపొందించాలని సూచించాం. హౌసింగ్ బోర్డు ఇళ్ల విక్రయాలు సామాన్యుల చేతికి అందేలా ఉండాలని దృష్టి సారించాం. కమర్షియల్ టాక్స్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, గనుల శాఖ ఆదాయాల్లో నెలకొన్న వృద్ధిపై సమీక్షించామని అన్నారు.