బీఆర్ఎస్ లో చేరేందుకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ లో కనీస మర్యాద దక్కలేదు...
బీ అర్ ఎస్ పార్టీ పటిష్టం కోసం కృషి చేస్తాం...
మెదక్ జూలై 07 (ప్రజా స్వరం)
గతంలో పార్టీలో జరిగిన ఇబ్బందుల వల్ల పార్టీని విడవలసి వచ్చిందని కాంగ్రెస్ పార్టీలో కనీసం మర్యాద లేకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరినట్లు తెలంగాణ ఉద్యమకారుడు జీవన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరుకునేందుకు సోమవారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయం లో నుండి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షం లో సుమారు 100 వాహనాలతో బయలుదేరి వెళ్ళేరు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు జీవన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో క్షణికావేశంలో కొద్దిపటి ఇబ్బందుల వల్ల బీఅర్ఎస్ పార్టీ నీ వీడి తప్పుదోవ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ లో వెళ్ళినట్లు భావన కలిగిందని, మార్పు పేరుతో పై మరో దోపిడి ప్రారంభమైందని గత 19 నెలలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కనీస ఆత్మగౌరవం మర్యాద కూడా లేకుండా పోయిందన్నారు. గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కోసం పోరాడిన ఏ వ్యక్తిని కూడా ఆదరించకుండా కనీస మర్యాదలు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఇంతే ఇంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం కూడా కెసిఆర్ చేతిలో ఉంటే అంతే రక్షణగా ఉంటుందన్నారు. మెదక్ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం అవుతుందని అన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.