చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయం లో సిద్దిపేట అభివృద్ధితో పోలిస్తే గజ్వేల్ అభివృద్ధి చాలా తక్కువే..
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు..
ప్రజాధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు వాడుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం..
విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు
గజ్వేల్ (ప్రజాస్వరం) :
సిద్దిపేట నియోజకవర్గం తో పోలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కేటాయించిన నిధులు చాలా తక్కువేనని చిల్లర మాటలకు బీఆర్ ఎస్ నాయకులు కేఆరాఫ్ అడ్రస్ గా మారారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్ బీజేపీ నాయకులు మామిళ్ల నాగు ముదిరాజ్ లు అన్నారు. వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రజాధనంతో నిర్మాణమై కేవలం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు వాడుకోవడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్డీవోను కలిసి తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చి అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తే కొంతమంది స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గజ్వేల్ లో అసంపూర్తి పనులుగా మిగిలిన చాలా అభివృద్ధి పనులకు మీ అసమర్ధత మీ చేతగానితనం కాదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. మీ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట మంత్రి అయిన హరీష్ రావు గజ్వేల్ కు వచ్చిన నిధులను కూడా తరలించకపోతే మాట్లాడలేని అసమర్ధ దద్దమ్మ నాయకులు ఈ గజ్వేల్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు అని కనీసం పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకొని పూర్తి చేయలేని మీరు మాపై మాట్లాడడం విడ్డూరం గా ఉందన్నారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇచ్చిన 5000 ఇండ్ల హామీతో మొదలు కొని మీ ఫెయిల్యూర్ ఇక్కడ వరకు కొనసాగుతూ వచ్చిందని అన్నారు. ఆరు నెలల్లో ఆరుసార్లు డబల్ బెడ్ రూమ్ అర్హులు , బాధితులు ధర్నా చేసిన మీరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాదనంతో మొదలుపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మధ్యలో మీ పార్టీ నాయకులే కమిషన్లకు ఎగబడితే ఆ పనులు ఆగి పోలేదా అని ప్రశ్నించారు. గజ్వేల్ కు బస్టాండ్ లేకుండా చేసిన ఘనత మీకే దక్కిందన్నారు. మల్లన్న సాగర్ బాధితులను చెట్టుకొక్కలు… పుట్టకోకల్ని చేసి ఎటువంటి ఉపాధి లేకుండా చేశారని వాళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత మీ బీఆర్ఎస్ దే నని అన్నారు. మాకేం కేసులు కొత్త కాదు గతంలో గజ్వేల్ లో 11 మంది హిందువులను జైల్లో పెట్టి ఈరోజు 30 మందికి పైగా హిందువులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారన్నారు. గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఇదే ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు రఘునందన్ రావు అని గుర్తు చేసుకోవాలన్నారు. ఎంపీ హోదాలో గజ్వేల్ ఆసుపత్రికి అంబులెన్స్ ఇచ్చారని, పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే సరస్వతి శిశు మందిర్ స్కూలుకు 13 లక్షల రూపాయలను కేటాయించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ములుగు లో ఉన్న కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ విధులతో నిర్మాణం అయిందని గుర్తుంచుకోవాలని అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని చిల్లర మాటలు కాదు గజ్వేల్ లో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించమని గజ్వేల్ కు పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులను ముందు ధర్నా నిర్వహించాలని కోరారు. గతంలో అవినీతి ఆరోపణలు చేస్తూ మీ పార్టీ కౌన్సిలర్లు క్యాంపులు నిర్వహిస్తే గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడుతుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించిందని అన్నారు. ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలో అనేక ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్సి మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్ రెడ్డి, మన్నె శేఖర్ నాయకులు పంజాల రాజు గౌడ్, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు మైస విజయ్, నాయకులు మంద వెంకట్, బీజేవైఎం నాయకులు గడియారం రాజేశ్వరి చారి, రోహిత్, కొక్కొండ అభినాష్ తదితరులు పాల్గొన్నారు.