చట్ట ప్రకారం నిబందనలు పాటించకపోతే చర్యలు తప్పవు  : తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

చట్ట ప్రకారం నిబందనలు పాటించకపోతే చర్యలు తప్పవు  : తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

తూప్రాన్, (,ప్రజాస్వరం:) : చట్ట ప్రకారం నిబందనలు పాటించకపోతే ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం తూప్రాన్ డివిజన్ పరిధిలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు, బార్ల ఓనర్లతో తూప్రాన్ లోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ...దాబాల్లో, రెస్టారెంట్లల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరపవద్దన్నారు. దాబాలు, హోటళ్ళు రాత్రి ఎక్కవ సమయం వరకు తెరిచి ఉండటం వలన నేరాలు ఎక్కవగా జరిగే ప్రమాదం ఉందన్నారు. డివిజన్ పరిదిలోని దాబా హోటళ్ళు, రెస్టారెంట్లు రాత్రి 12 గంటల లోపు మూసివేయాలన్నారు. హోటళ్ళ వద్ద ఎవరైనా ఎక్కువ రోజులుగా ఉండిపోతే దాబాల్లో ఎవరైన వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలన్నారు. ప్రతి దాబాలు, హోటళ్ళ లో క్వాలిటి ఉన్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హోటల్ కు వచ్చిన ప్రతి కస్టమర్ కు కల్తీలేని మంచి నాణ్యత కలిగిన భోజనం అందించాలన్నారు.రాత్రి సమయాల్లో ధాబాల వద్ద ఎక్కవగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని అలాంటి సమాచారం ఉంటే పోలిసులకి తెలియజేయాలన్నారు. ప్రతి ధాబాల్లో,హోటళ్ళలో మద్యం సిట్లింగ్ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎవరైన కస్టమర్లు ఇబ్బంది పెడితే ఫ్లెక్సిలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు,కస్టమర్లకి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్,నర్సాపూర్,రామాయంపేట సిఐలు రంగక్రిష్ణ, జాన్ రెడ్డి, వెంకటరాజా గౌడ్, తూప్రాన్ డివిజన్ ఎస్సైలు శివానందం, లింగం, చైతన్యరెడ్డి,పోలీస్ సిబ్బంది తదితులున్నారు.