అటవీ,రెవిన్యూ భూమాలపై జాయింట్ సర్వే చేయాలి
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అటవీ, రెవెన్యూ భూములపై జాయింట్ సర్వే చేయాలి...
పూర్తి స్థాయి లో తనిఖీ చేయాలి...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్....
మెదక్ జూలై 05 (ప్రజా స్వరం)
అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ తో డీఎఫ్ఓ జోజి, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జై చంద్రారెడ్డి, సంబంధిత తహశీల్దార్ లతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఫారెస్ట్ రెవెన్యూ భూ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ సమస్యలను రికాన్సిలేషన్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అటవీ భూములు, రెవెన్యూ భూములకు సంబంధించి అధికారులు జాయింట్ తనికి చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మండలాల వారీగా అసైన్మెంట్ రిజిస్టర్ వెరిఫై చేసి, పూర్తి స్థాయిలో తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏడి సర్వే ల్యాండ్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, తాసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.