సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీ రఘునందన్ రావు
వర్గల్ / గజ్వేల్ ( ప్రజాస్వరం ) : మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిక్షణం నమ్మినవారికి సేవలందించేందుకు ఎప్పుడు ముందుంటాడని వర్గల్ మండల బీజేపీ అధ్యక్షుడు బొల్లిపల్లి తిరుపతిరెడ్డి అన్నారు. మైలారం గ్రామానికి చెందిన ఎర్రవాడ ప్రవీణ్ కుమారుడు నిమోనియా వ్యాధితో ఆసుపత్రిలో చేరడం జరిగింది. మెరుగైన వైద్యం ఖర్చుల నిమిత్తం సీ ఎం ఆర్ ఎఫ్ కోసం ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని మూడు లక్షల 50 వేల రూపాయల చెక్కును మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును గురువారం కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చిన అతని ముందుండి సమస్యల పరిష్కారానికి ఉన్న గొప్ప నాయకుడు ఎంపీ అని కొనియాడారు. శస్త్ర చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న మరుసటి రోజు నుంచే ప్రజా సేవకు పూనుకున్నాడని అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే వేరే ఎవరైనా విశ్రాంతి పేరుతో ఉంటారని కానీ ఎంపీ రఘునందన్ మరుసటి రోజు తెల్లవారుజాము నుండి పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వచ్చాడని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కిర్రి బుచ్చిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్ నాయకులు టేకులపల్లి శ్రీనివాస్ రెడ్డి బూత్ అధ్యక్షులు నర్ర రవి తదితరులు పాల్గొన్నారు.