బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...
బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి..
పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు బీజేపీ గెలుపు ఖాయం...
2028 లో తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి...
రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ....
40 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...
మెదక్ జూలై 18 (ప్రజా స్వరం)
నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు మొట్టమొదటి సారి గా మెదక్ జిల్లా వస్తున్న క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంబోజి పల్లి నుండి మెదక్ జిల్లా కేంద్రం సాయి బాలాజీ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మాట్లాడుతూ తెలంగాణ లో 40 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. విమర్శలు చేసే పక్క పార్టీ నేతలు గత పదేళ్ల లో కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఎందుకు చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టిందని అన్నారు. మోస పూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో రైతులు పంట లు వేసుకుని సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే రైతులకు సింగూరు నీటిని విడుదల చేయండి అంటే పట్టించుకోవడం లేదనీ అన్నారు. రైతులకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి గురించి పార్లమెంట్ లో తన గళాన్ని వినిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నిధులతోనే నేషనల్ హైవే, రైలు లైన్స్ నిర్మించడం జరుగుతుందనీ, ఈ విషయం ఎప్పుడూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రాజీనామా చేసి బీసీ నీ సీఎం చేయాలని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు దేశం వ్యాప్తంగా అవినీతి కి పాల్పడిందనీ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 % రిజర్వేషన్స్ లో 10% ముస్లింలకు ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందనీ, మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మాది అన్నారు. 2028 లో తెలంగాణ లో బీజేపీ నీ అధికారంలోకి తీసుకునే రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారాని, దీనికి మీరు చేయాల్సిన కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండమే పేర్కొన్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కోసం నేను పని చేస్తా అన్నారు. మెదక్ ఎంపీ గా రఘునందన్ రావు ఎలా గెలుస్తాడో చూస్తా అని చెప్పిన వారికి ఎన్నికల్లో ఓటు ద్వారా సరైన సమాధానం చెప్పమని అన్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కు చిన్నపాటి నుండి మెదక్ కు విడదీయలేని అనుబంధం ఉందనీ అన్నారు. దేశంలో కార్యకర్తల కష్టం వస్తే అర్ధరాత్రి నిలబడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బీజేపీ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో రైతులకు సన్న వడ్ల కు బోనస్ ఇస్తామని చెప్పి సున్నం పెట్టారని తెలిపారు. ఈ దేశంలో మతం పేరుతో విభజించి ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బీసీ పైన చిత్తశుద్ధి ఉంటే మీ క్యాబినెట్ లో బీసీ లకు 8 సీట్లు ఇవ్వాలని అన్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ నిన్న మీడియా తో చేసింది చిట్ చాట్ కాదు చీటింగ్ చాట్ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇస్తానని చెబుతూ అందులో 10% ముస్లిం లకు ఎలా ఇస్తారని అన్నారు. ఇందిరాగాంధీ ఎంపీ గా ఉన్నప్పటి నుండి మెదక్ రైలు ఇస్తానని ఆశ చూపారు తప్ప బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నే మెదక్ రైలు ప్రారంభించుకున్నామని, ఈ ఘనత ఆయనే కే దక్కుతుందని అన్నారు. ఇక్కడి ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నేషనల్ హైవే వేస్తున్నామని అన్నారు. త్వరలో మెదక్, నర్సాపూర్ 4 వరుసల రోడ్డు నిర్మించి తీరుతాం అన్నారు. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కరణం పరిణీత, సంగప్ప, కామారెడ్డి జిల్లా ప్రభారి, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జనగామ జిల్లా ప్రభారి నంద రెడ్డి, జిల్లా ఇంచార్జీ రాగి రాములు, సుభాష్ చంద్ర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లు శ్రీనివాస్, ఎమ్ఎల్ఎన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కాలదేవి మధు, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మండల అధ్యక్షురాలు బెండ వీణ, ఓబీసీ మోర్చా నాయకులు నిర్మల, బీజేపీ నాయకులు బక్కావారి శివ, నల్లాల విజయ్ కుమార్, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.