ఈనెల 28న మెదక్ కు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రాక
28న మెదక్ కు మంద కృష్ణ మాదిగ రాక
మనోహరాబాద్, (ప్రజాస్వరం) :
వికలాంగులకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని ఆసరా పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న మెదక్ జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ బొజ్జ సైదులు మాదిగ వెల్లడించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేయడం జరుగుతుందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ఈ సభకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వికలాంగుల జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, ఎం ఎస్ పి అధ్యక్షుడు ఉషన్న గల మురళి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ, మండల అధ్యక్షులు వర్గంటి మురళి మాదిగ, నాచారం అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.