ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన ఈవో ఎస్. వెంకట్రావు
శ్రీ స్వామివారికి ఇచ్చిన మొక్కును తీర్చుకుంటున్న ఈవో ఎస్. వెంకట్రావు
ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన
యాదగిరిగుట్ట / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
సర్వీసులో ఉన్నంతకాలం ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల చొప్పున శ్రీ స్వామివారి శాశ్వత నిత్య ప్రసాద వితరణ పథకానికి అందిస్తానని ప్రకటించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు తన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో కూడా ఈ పథకానికి తన మూడు లక్షల రూపాయల విరాళం అందజేసిన అయన తాజాగా జూలై మాసం వేతనం నుండి కూడా ఓక లక్ష రూపాయలు దేవస్థానానికి అందజేశారు. యాదగిరిగుట్టలో శ్రీ స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు శనివారం లడ్డు ప్రసాదం, మిగతా 6 రోజులలో పులిహోర ప్రసాదం నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించి, స్వయంగా ప్రారంభించారు. దాతలు తమకు నచ్చిన రోజులలో, నచ్చిన తిథిలలో లేదా ప్రతినిత్యం వారి వారి పేరున ప్రసాద వితరణకు విరాళాలు సమర్పించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ఈవో వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.