శ్రీశైలం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ
అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ
శ్రీశైలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
ఆషాఢమాస మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం బుధవారం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించబడింది. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.బుధవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, స్వామివారి ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం. ఉమానాగేశ్వరశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాలు జరిపి బోనం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, రోగకారక పరిస్థితులు రాకుండా ఉండాలని, జనులందరికి ఆయురారోగ్యాలు చేకూరాని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాని ఈ సంకల్పములో చెప్పబడింది. తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించబడింది.