కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం...
సంతోష వెంకటేష్...
కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయంచేస్తున్న మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు
గజ్వెల్, వర్గల్ ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం) :
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష వెంకటేష్ అండగా నిలిచారు. బీఆర్ఎస్ కార్యకర్త కోటూరి జానయ్య కూతురు పెళ్ళికి రూ.60 వేల ఆర్థిక సహాయం అందించి గ్రామ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు.సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంనికి చెందిన జానయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉండగా పెద్ద కూతురు వివాహం చేసాడు. ఈ నెల 22 తేదీ ఆదివారం రోజున రెండవ కూతురు పెళ్లి ఉందని తెలుసుకొని వారికీ 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మీనాజీపేట మాజీ సర్పంచ్ సత్యం యాదవ్, బీఆర్ఎస్ సంతోష వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెంటగౌడ్, కుమార్ యాదవ్,ఆంజనేయులు,భాస్కర్ గౌడ్, వెంకటేష్ గౌడ్,సురేష్, ప్రభాకర్, మధు, సంజీవ్,నాగరాజ్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు


