గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...

గోలి మమత సంతోష్...

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...

గజ్వేల్, 16 ఫిబ్రవరి (ప్రజాస్వరం) : 

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్‌గా గోలి మమత సంతోష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గోలి మమత సంతోష్ మాట్లాడుతూ తన గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన 2వ వార్డు ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వార్డులోని సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....