మున్సిపల్ ఎన్నికల్లో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం...
తూప్రాన్, ఫిబ్రవరి 2 (ప్రజాస్వరం);
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది అరు వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా గడపగడపకు ప్రచారం కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల. వరకు విద్యుత్ బిల్లు ఫ్రీగా చేసిందని రేషన్ కార్డు ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తూప్రాన్ మున్సిపాలిటీకి 16 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు జరిగాయని వార్డుల వారీగా సిసి రోడ్లకు మురికి కాలువలకు పనులు ప్రారంభమయ్యాయని మున్సిపల్ ఏర్పడ్డాక మరిన్ని నిధులతో వార్డులో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాలేష్ గుప్తా రాజులు ప్రణయ్ రాజేష్ విట్టల్ రెడ్డి వెంకట్ నితీష్ తదితరులు పాల్గొన్నారు


