మెదక్ లో మానస సాయిరాం ఏకగ్రీవ ఎన్నిక....
By Prajaswaram
On
మెదక్, ఫిబ్రవరి 02 (ప్రజాస్వరం):
మెదక్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. 32 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గోదల మానస సాయిరాం వరుసగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన గోదల జ్యోతి నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానస ఏకగ్రీవమయ్యారు. 2020లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మానస నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది మానస వరుసగా రెండుసార్లు ఏకగ్రీవం విశేషం..
Latest News
15 Feb 2026 12:36:22
మాసాయిపేట, ఫిబ్రవరి 15 ( ప్రజాస్వరం ) : భవాని సంగమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.శివ


