అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.కాగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి,మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి రుద్ర సంతోష్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీసరీ మహిపాల్ రెడ్డి,రెడ్డెంగారి నవీన్ రెడ్డి,గంగపుత్ర నర్సింగరావు హాజరై వారి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్. మల్లారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.పార్టీకి కష్ట కాలంలో అండగా ఉంటూ పార్టీ అభివృద్ధి కృషి చేసిన మల్లారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.వీరితో పాటుగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఏర్పాటుకు ఆర్.మల్లారెడ్డి విశేషంగా సేవలు అందించారని కొనియాడారు.తన సొంత నిధులతో గ్రామంలో శ్రీహరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయం,శివాలయం నిర్మించిన ఘనత మల్లారెడ్డికి దక్కుతుందని కొనియాడారు.అదేవిధంగా గోసాయిగూడ గ్రామంలోని శ్రీ భూ లక్ష్మమ్మ ఆలయానికి తనవంతు సహకారం అందించారు.అంతేకాకుండా పూడూరు జెడ్పీహెచ్ ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ తమిళనాడులోని ఏషియా వెదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ 2022 సంవత్సరంలో గౌరవ డాక్టర్ రేటుతో సన్మానించిందని తెలిపారు.పలువురు ఆర్.మల్లారెడ్డినితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అంత్యక్రియలను గ్రామస్తుల అశ్రుననాల మధ్య నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్,మండల అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,రమణారెడ్డి,మాజీ సర్పంచులు ఎన్.నర్సింహ రెడ్డి,సురేందర్ ముదిరాజ్,దుడ్డు సంజీవ రావు,కోలా స్రవంతి వెంకటేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు,మాజీ కౌన్సిలర్లు సాయిపేట శ్రీనివాస్,రామన్నగారి మణికంఠ గౌడ్,జకట దేవ,ఎల్లంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి,నాయకులు బాల్ రెడ్డి,సింగరేణి పోచయ్య,సారా ముత్యాల గౌడ్,అక్రమ పాషా,సింగిరెడ్డి నరేందర్ రెడ్డి,శ్రీనాథ్ రెడ్డి,గ్రామస్తులు,కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


