ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...

సిఐ రంగా కృష్ణ ..

ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...

తూప్రాన్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం):

 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మున్సిపల్ ఫలితాలు వచ్చాక అభ్యర్థులు ఊరేగింపు లు డిజే సౌండ్ రోడ్డు షో లకు బాణాసంచా కాల్చడం అనుమతి లేదని సిఐ రంగా కృష్ణ తెలిపారు తూప్రాన్‌లోని నోబుల్ కళాశాలలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మరియు తూప్రాన్ పట్టణ ప్రజలకు సూచనలు చేసిన తూప్రాన్ సిఐ రంగా కృష్ణ తెలిపారు

కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వారందరూ తమ వాహనాలను లింగారెడ్డిపేట్ బస్టాండ్ సమీపంలో, 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే నిలిపివేయాలి.

రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్ చేసినట్లయితే సంబంధిత వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.అని సిఐ పేర్కొన్నారు

కౌంటింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలోకి కేవలం అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు మరియు కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది.

ఇతరులకు ప్రవేశం లేదు.

200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్లు అనుమతించబడవు. సంబంధిత వ్యక్తులు తమ సెల్ ఫోన్లను బయట భద్రపరచి మాత్రమే లోపలికి రావాలి.అని చెప్పారు

మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది.

కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, రోడ్డు షోలు, బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం, గుంపులుగా గుమికూడడం వంటి కార్యక్రమాలు నిర్వహించరాదు.

మైక్‌లు, లౌడ్‌స్పీకర్లు మరియు వాహన ర్యాలీలకు అనుమతి లేదు.

చట్టం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు తీసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, ప్రేరేపించే పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం నేరం. ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేయబడతాయి.

గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం నిషేధించబడింది.

ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని తూప్రాన్ సిఐ రంగా కృష్ణ కోరారు

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....