ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
చింతల విద్యాధర్ ....
జగదేవ్ పూర్, ఫిబ్రవరి11(ప్రజాస్వరం):
పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి తో కలిసి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు
కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షం.. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రతి గారంటీని పేదలకు అందిస్తుందని తెలిపారు. గతంలో ఆర్టీసీ రెట్లు పెంచితే.. కాంగ్రెస్ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని పేర్కొన్నారు.
గ్రామంలో పేద ప్రజలకు ఆరు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గ్రామంలో అర్హులైన వారు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


