115 దేశీదారు బాటిళ్లు స్వాధీనం....
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. జుల్ఫీకర్ అహ్మద్..
రాజుల తండాలో దేశీదారు అమ్మకందారిపై కేసు
ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం):
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజుల తండా గ్రామంలో ఎక్సైజ్ అధికారులు శనివారం నిర్వహించిన సోదాల్లో అక్రమంగా దేశీదారు మద్యం అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సబుల్ విఘ్నాన్ సింగ్ (S/o రథన్ సింగ్) అనే వ్యక్తి దేశీదారు మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆయన వద్ద నుంచి మొత్తం 115 (90 ఎంఎల్) దేశీదారు బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. జుల్ఫీకర్ అహ్మద్ తెలిపారు.
ఈ దాడుల్లో ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీనివాస్, ఎక్సైజ్ సిబ్బంది కార్తీక్, మొహమ్మద్, అరుణ, మంజుల పాల్గొన్నారు. అక్రమంగా గంజాయి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా కలిగి ఉన్నా, అమ్మినా లేదా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.


