ఎన్నికల్లో టీ ఆర్ పీ నీ గెలిపించాలి...

ఎన్నికల్లో టీ ఆర్ పీ నీ గెలిపించాలి...

మేడ్చల్ , జనవరి 28 (ప్రజాస్వరం) :

కార్పొరేట్ రాజకీయాలను మేడ్చల్ జిల్లా ప్రజలు తరిమికొట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధా గాని హరీష్ శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ పి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుధాగాని హరీష్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి సర్పంచి ఎన్నికలను చేపట్టిందని అలాగే ప్రస్తుతం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పూర్తిస్థాయిలో కౌన్సిలర్ అభ్యర్థులను పోటీకి బరిలో దింపుతున్నట్లు తెలిపారు. ఆయా మున్సిపాలిటీల ఓటర్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మనవి చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలలోకి వచ్చిన వారికే ప్రజలు ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న బీసీల రాజ్యాధికారం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి టీ.ఆర్.పి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాన పార్టీలు బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు చక్రపాణి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు శాలిని, యువజన విభాగం అధ్యక్షులు అరుణ్ పటేల్ . కార్మిక విభాగం అధ్యక్షులు సాయికుమార్ పటేల్. వైస్ ప్రెసిడెంట్ విక్రం యాదవ్, ముత్యాల శంకర్ యాదవ్, రాంప్రసాద్, శ్రీధర్ యాదవ్, కూకట్పల్లి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్, కుత్బుల్లాపూర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గజం శ్రీనివాస్, జిల్లా మండలాల ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు..