ఆదాని అంబానీలకు దోచి పెట్టేందుకే విబి జీ రామ్ జీ చట్టం...
పిసిసి వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం.... మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకే బిజెపి కుట్ర.... జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే సహించేది లేదు.... చిన్న శంకరంపేట, జనవరి 28 ( ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండలం కొరివి పల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ నిరసన కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాలువాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు అనంతరం కొరివి పల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల రైతుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు, ఉపాధి హామీ కూలలతో మాట్లాడి వారితో సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్,మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం అని అలాంటి ఉపాధి హామీ పథకాన్ని తొలగించే విధంగా బిజెపి ప్రభుత్వం చేయడం సిగ్గుచేటని పేదల కడుపు కొట్టే పథకాలను తీసుకువచ్చి పేదలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు అన్నారు, విభీ జీ, రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పథకం ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసమేనని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పేదలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు, గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యమని గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటదని గ్రామాలలో పేద ప్రజలు మూడు పూటలా తిండి తినాలంటే వారికి ఏదో ఒక ఉపాధి కలిపించాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగిందని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలు ఎలా ఉన్నా సరే ఆదాని అంబానీ బంగారు మెతుకులు తినాలని ఉద్దేశంతో పథకాన్ని రద్దు చేసి విధంగా చట్టాలు తేవడం జరుగుతుందని తెలిపారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని పేద ప్రజల బతుకులు బాగుపడే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు,జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి పోతరాజు రమణ, యాదవరావు శ్రీనివాస్ రెడ్డి, పోతరాజు జనార్ధన్, సుధాకర్, మనోజ్ కుమార్, బిక్షపతి, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజాసింగ్, తదితరులు పాల్గొన్నారు,


