గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....

గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....

మేడ్చల్, ఫిబ్రవరి 07(ప్రజాస్వరం):

గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ యతీష్ చంద్ర వివరాల ప్రకారం.. మేడ్చల్ PS పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద సుమారు 35 సంవత్సరాల గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల సమాచారం ద్వారా గుర్తించబడినట్లు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా వ్యక్తి చాతి పైనుండి గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో మృతి చెందినట్లు నిర్ధారించమని చెప్పారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే మేడ్చల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు..