తూప్రాన్ 7వ వార్డు అల్లాపూర్ లో బీఆర్ఎస్ ప్రచారం జోరు....
మనోహరాబాద్, ఫిబ్రవరి 07( ప్రజాస్వరం ):
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ ఏడో వాడు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె నాగరాజు గెలుపు కోసం అల్లాపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం జోరందుకుంది. ప్రతి ఓటర్ను కలుస్తూ మన్నే నాగరాజు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నాగరాజుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది అంటూ ప్రజలు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మనోహర మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, ముప్పిరెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సాడు సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు పెద్దింటి చిన్న యాదగిరి, కొత్తూరు సాయికుమార్, ఈసురు గోవర్ధన్, మన్నే సత్యనారాయణ, దుర్గం కిషన్, మర్రి స్వామి. కృష్ణారెడ్డి, వడ్ల మచ్చందర్, అశోక్ వొడ్. వడ్ల ఆచారి., పి.స్వామి. వెంకటేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


