ఆదర్శ గ్రామంలో 385వ స్వచ్ఛభారత్... 

ఆదర్శ గ్రామంలో 385వ స్వచ్ఛభారత్... 

తూప్రాన్, జనవరి 25 (ప్రజాస్వరం): 

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 385 వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ గ్రామంలోని 4,5,6 వ వార్డులలో చేపట్టారు. చెత్తాచెదారంతోపాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపురులతో శుభ్రపరిచారు. మేము సైతం అంటూ గ్రామంలోని చిన్నారులు శ్రమదానంలో పాల్గొని గ్రామస్తులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛభారత్ లో భాగంగా రెండు గంటలపాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. అంతకుముందు 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తుల చేత ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ యాదవ్, ఉపసర్పంచ్ పల్లెపాటి స్వామి, వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, పిట్ల వేణు,సరిత పరమేష్ , మన్నె తిరుపతి, జిన్న కృష్ణ, అంగన్వాడి టీచర్లు స్వర్ణలత, లావణ్య, ఆశ వర్కర్ ఇందిరా, వివో సంతోష,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.