పీహెచ్సీ ఆకస్మికంగా తనిఖీ....

పీహెచ్సీ ఆకస్మికంగా తనిఖీ....

 

ఆసుపత్రి లోని అన్ని విభాగాల పరిశీలన...

మెదక్ జనవరి 24 (ప్రజాస్వరం):

నర్సాపూర్ మండలం రెడ్డి పల్లె గ్రామంలో ఉన్న పిహెచ్సి ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారనీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.