తూప్రాన్ మున్సిపల్ లో సిద్దిపేట నాయకుల పెత్తనం ఏంటి...?  

తూప్రాన్ మున్సిపల్ లో సిద్దిపేట నాయకుల పెత్తనం ఏంటి...?   

తూప్రాన్ జనవరి 24( ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీలో రానున్న ఎన్నికలలో సిద్దిపేట బిఆర్ఎస్ నాయకుల పెత్తనం ఏంటని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని రెండవ వార్డులో కొక్కొండ దీపక్ రెడ్డి అభ్యర్థి ప్రకటిస్తూ ప్రచారం సాగించారు తూప్రాన్ లో 16 వార్డులలో బీ ఆర్ ఎస్ పార్టీకి స్థానికులు కరువై సిద్దిపేట నుంచి వలస వచ్చిన బి ఆర్ ఎస్ నాయకులు పెత్తనం చలాయిస్తున్నారని ఆయన ప్రశ్నించారు స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కెసిఆర్ హౌస్ లో ఉంటూ సిద్దిపేట అల్లుడు హరీష్ పెత్తనం ఏంటి అనిసిద్దిపేట కు చెందిన నాయకులను ఇంచార్జ్ లు గా పెట్టడం పై ఓటమి భయం పుట్టుకుందని ఆయన అన్నారు బి ఆర్ ఎస్ కుటుంబ కలహాలతో చేసిన అవినీతి కెసిఆర్ కూతురు కవిత నే బట్టబయలు చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి విశ్వరాజ్ చిన్న నాగరాజ్ దీపక్ రెడ్డి కామారం వెంకటేష్తదితరులు ఉన్నారు