తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తెరాస యువత ఇంటింటి ప్రచారం

తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తెరాస యువత ఇంటింటి ప్రచారం

తూప్రాన్, జనవరి 24: (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డులో తెరాస యువత, స్థానిక నాయకులు మరియు యువకులు కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. 

 కాంగ్రెస్ బాకీ కార్డులు ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ అబద్దపు హామీలపై ఓటర్లకు వివరించారు

 కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి కి ప్రచారం చేశారు

ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని రాజకీయ హామీలు, అభివృద్ధి అంశాలు మరియు స్థానిక సమస్యలపై చర్చించారు.

 స్థానిక ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధి, మౌలిక వసతులు, యువత అవకాశాలు వంటి అంశాలపై చర్చించారని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి రమేష్, వార్డు అధ్యక్షులు బందెల నరేష్, మామిండ్ల అనిల్, గణేష్ రెడ్డి, మున్సిపల్ యువజన అధ్యక్షులు శ్రీకాంత్ చారి, వెంకటాచారి, అరవింద్, ప్రణయ్, అరుణ్, నరేందర్, సాయి తదితర నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.