పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలి

అటవీ శాఖ బీట్ అధికారి చిరంజీవి

పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలి

మాసాయిపేట (ప్రజాస్వరం) :

 

,చెట్ల తిమ్మాయపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ బీట్ అధికారి చిరంజీవి తెలిపారు. రెండు, మూడు రోజులుగా చిరుత పులి కనిపిస్తుండడంతో శనివారం గ్రామాల్లో పర్యటించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను ఉంచరాదని, రాత్రుల్లో సమీపంలోకి వెళ్లవద్దని, ఒంటరిగా ప్రజలు తిరగరాదని సూచించారు.