చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
మనోహరాబాద్ (ప్రజాస్వరం) :
స్నానానికి చెరువులోకి వెళ్లి కాలు జారీ పడి ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొనాయపల్లి పీ టీ గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య (45) వారి పాలి వారిది దశదినకర్మ ఉండడంతో చెరువులో స్నానానికి వెళ్లగా కాలుజారి నీటిలో పడడం జరిగింది. దీంతో ఊపిరాడక నిటిలో మునిగిపోయి మృతి చెందాడు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో రెండు గంటలపాటు వెతికి అప్పటికే మృతిచెందడం తో ఒడ్డుకు చేర్చడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతుడని పోలీసులు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు కలరు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


