తూప్రాన్ మున్సిపల్ 16 వార్డులో 15 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు..
తూప్రాన్ మున్సిపల్ 16 వార్డులో 15 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు...కమిసనర్ గణేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. తూప్రాన్ జనవరి2 పూర్ణరాజు ప్రతినిధి (ప్రజాస్వరం) తూప్రాన్ పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో 16 వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. వార్డులలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టడానికి రూ. 15 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ పనులు పూర్తి కావడంతో నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నాచారం గుట్ట చైర్మన్ రవీందర్ గుప్తా మాజీ కౌన్స్ లర్ నారాయణ గుప్తా శ్రీశైలం గౌడ్ శ్రీనివాస్ కృష్ణ భగవాన్ రెడ్డి విశ్వరాజ్ దీపక్ రెడ్డి నాగరాజు గౌడ్ శ్రీకాంత్ రెడ్టి తుమ్మెట శ్రీనివాస్ యాదవ్ లక్ష్మణ్ వెంకట్ గౌడ్ నర్సింగరావు రాము నగేష్ ఉమర్ హాజరు హసన్ షెకిల్ తదితరులు పాల్గొన్నారు


