యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు....
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది...
మెదక్ డిసెంబర్ 31 (ప్రజా స్వరం)
జిల్లాలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ తెలిపారు. అక్టోబర్ 2025 జనవరి 26 సంవత్సరానికి మన జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని రాష్ట్రానికి ప్రతిపాదనాలు పంపమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 30 వరకు మెదక్ జిల్లాకు 12663 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, 8000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు ఇప్పటి వరకు కొనుగోలు చేయడం కూడా జరిగిందన్నారు. ఇంకా జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, జిల్లాలో మన అవసరానికి మించి యూరియా జనవరి కి కూడా రాబోతుందని రైతులు గమనించాలని పేర్కొన్నారు. రైతులు యూరియా దొరకదేమోనని ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు


