గుమ్మడిదల మున్సిపాలిటీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన

గుమ్మడిదల మున్సిపాలిటీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన

గుమ్మడిదల, జనవరి 02 (ప్రజా స్వరం)

మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పరిశీలన కోసం డిస్ప్లే చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

Read More నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....

డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో పేర్లు, చిరునామాలు, చేర్పులు లేదా తొలగింపులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తేదీ 04-01-2026 లోపు రాతపూర్వకంగా గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Read More చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం

ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని కమిషనర్ కోరారు.

Read More పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది