నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు...

నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...

మెదక్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...

Read More సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి....

సీసీ కెమెరాలతో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిఘా...

Read More రోడ్డుపై బైఠాయించిన రైతులు..

 

Read More జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు..

Read More రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి

 

మెదక్ డిసెంబర్ 27 (ప్రజా స్వరం)

 

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని, పిల్లలు–పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. పోలీసు శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. డిసెంబర్‌ 31 రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి సంబంధితులపై నాన్‌–బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డిసెంబర్‌ 31 రాత్రి ఆర్గనైజ్డ్‌గా వేడుకలు నిర్వహించేందుకు పోలీసు అనుమతి లేదని, టపాసులు, డీజేలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లకు మద్యం విక్రయించడం నేరమని హెచ్చరించారు. రహదారులు బ్లాక్ చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధి దీపాలపై రాళ్లు వేయడం, అద్దాలు పగలగొట్టడం, నిషేధిత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాలు నిర్ణీత సమయాల్లోనే మూసివేయాలని, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏ కార్యక్రమం నిర్వహించినా ముందస్తుగా పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఆన్లైన్‌లో అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వవద్దని ప్రజలను కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసు అధికారులను లేదా డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.