జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డును పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు...    

 చిన్నశంకరంపేట డిసెంబర్ 30  ( ప్రజాస్వరం) :

Read More రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు గా పెంటాగౌడ్

 నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలనీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,సీసీ కెమెరాలతో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిఘాఏర్పాటు చేయడం జరుగుతుందని  జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, అన్నారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పలు రికార్డులను తనిఖీ చేశారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించడం జరుగుతుందని కేసుల వివరాలను తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, సూచించారు. ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు పిల్లలు, పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలని, పోలీసు శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు.ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చట్ట వ్యతిరేక చర్యలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.డిసెంబర్ 31 రాత్రి ఎలాంటి ఆర్గనైజ్డ్ వేడుకలకు మద్యం మత్తులో వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మైనర్లకు మద్యం విక్రయించడం నేరమని తెలిపారు.రహదారులు బ్లాక్ చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, వీధి దీపాలు ధ్వంసం చేయడం, నిషేధిత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.మద్యం దుకాణాలు నిర్ణీత సమయాల్లోనే మూసివేయాలని, బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏ కార్యక్రమం నిర్వహించినా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  స్పష్టం చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక  పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ఎస్సై నారాయణ గౌడ్ ఎస్ బి సి ఐ  సందీప్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి