అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు
అబద్దాలకు కేరాఫ్ సీఎం రేవంత్ రెడ్డి..
గజ్వెల్ 92 సర్పంచ్లను బిఆరెస్ గెలుసుకుంది.
మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
గజ్వెల్ డిసెంబర్ 19 ప్రజాస్వరం..
గజ్వేల్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు , మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిందని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు తారుమారు చేసి అబద్ధాలకు తెరలేపారని రాష్ట్రంలో బిఅర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో పది శాతం కూడా గెలవదని రేవంత్ అనుకున్నాడనీ కానీ బిఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం తో సీఎం రేవంత్ కు మైండ్ బ్లాక్ ఐపోయిందనీ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో వివిధ పార్టీ ల కార్యకర్తలు హరీష్ రావు సమక్షం లో బి ఆర్ ఎస్ పార్టీ చేరగా వారికి హరీష్ రావు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.అనంతరం హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ మొదటి సర్పంచ్ పలితాలు చూశాక సీఎం రేవంత్ డబ్బు మూటలను హైదరాబాద్ నుండి రెండవ , మూడవ విడత సర్పంచ్ ఎన్నికలకు పైసలు అడ్డగోలుగా పంపిండనీ ఆరోపించారు.బి అర్ ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు 80 శాతం నుండి 90 శాతం 100 శాతం డిసిసి లు , జెడ్పీలు , 99 శాతం మున్సిపల్ లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపొందిందని అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా బి ఆర్ ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్ స్తనాలు కైవసం చేసుకుంది.ఇంకా 3 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా కూడా బి ఆర్ ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని,ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి జిల్లాల పర్యటనలు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనీ అన్నారు.గజ్వేల్ నియోజకవర్గం లో ఉన్న 179 సర్పంచ్ స్థానాల్లో 92 బిఆర్ఎస్ పార్టీ గెలుపొందగా 68 కాంగ్రెస్ పార్టీ గెలువగా ఒక సీఎం అయి ఉండి నిస్సిగ్గుగా లెక్కలు తారుమారు చేసి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతుండనీ మండి పడ్డారు.రెండు ఏండ్ల నుండి రేవంత్ రెడ్డి గజ్వేల్ రోడ్లకు తట్టెడు మట్టి ఎత్తలేదు ,గజ్వేల్ కు చేసింది ఏమి లేదనీ,ఫుడ్ పాయిజన్ పిల్లలు దవాఖానాలు పోతే , ఎంజీఎం ఆసుపత్రిలో మంచాల పై ఎలుకలు తిరుగుతుంది కనపడటం లేదా అని ప్రశ్నించారు.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాదా అని అన్నారు.ఈ కార్యక్రమంలో హరీష్ రావు తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి , మదాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


