వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి..

వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ఘనంగా వైకుంఠ ఏకాదశి..
ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వరా స్వామిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్.. 
వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి..

మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం)

Read More సంగారెడ్డి లో జర్నలిస్టుల ఆందోళన 

వేంకటేశ్వర స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కోదండ రామాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి  సేవలో భక్తులతో కలిసి పాల్గొని పల్లకి మొశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో రాష్ట్ర జలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం, వెంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, కంచి మధుసూదన్, మెదక్ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు ఆర్కె శ్రీనివాస్, వంజరి జయరాజ్ ,మాయ. మల్లేశం, నాయకులు లింగారెడ్డి, మహిపాల్ రెడ్డి, మోహన్ నాయక్, శ్రీను నాయక్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు